ఎర్ర మల్లెలు erra mallelu
రామారాజ్యం తీరున చూడు శివా శంభులింగ
లింగా రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
తిందామంటే తిండీ లేదు,ఉందామంటే ఇల్లు లేదు
తిందామంటే తిండీ లేదు,ఉందామంటే ఇల్లు లేదు
చేదామంటే కొలువూ లేదు,పోదామంటే నెలవు లేదు
నాంపల్లి ||
గుక్కెడు గంజి కరువైపోయె,బక్కటి ప్రాణం బరువై పోయె
పేదాబిక్కి పొట్టలుకొట్టి మేడలుకట్టిన చీకటి సెట్టి
నాంపల్లి స్టేషనుకాడి||
లేని అమ్మది అతుకుల బతుకు ఉన్న బొమ్మకి అందం ఎరువు
కారుల్లోన తిరిగే తల్లికి కట్టే బట్ట బరువై పాయె
నాంపల్లి ||
ముందు ఒప్పులు,వెనక తప్పులు వున్నవాడికే అన్ని చెల్లు
ఉలకావేమి పలకావేమి బండారాయిగ మారిన తల్లి
నాంపల్లి||