సీతారామయ్యగారి మనవరాలు seetha ramayya gari manavaraalu

వెలుగూ రేఖలవారు తెలవారి తామొచ్చి ఎండా,ముగ్గులు పెట్టంగ
చిలకాముక్కులవారు చీకటితోనే వచ్చి చిగురు,తోరణ కట్టంగా
మనవలనెత్తే తాత మనువడ వచ్చాడు మందార పువ్వంటి మా బామ్మని అమ్మమ్మని
నోమీనమ్మల్ల లాలో నోమన్నలాలో సందామామ సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాల బంతి సందామామ సందామామ
పండంటి ముత్తైదు సందామామ పసుపుబొట్టంత మాతాత సందామామ
నోమీనమ్మల్లలాలో నోమన్నలాలో సందామామ సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాలబంతి సందామామ సందామామ


కూర్చుని చెరిగే చేతికురులపై తుమ్మెదలాడే ఓ లాల తుమ్మెదలాడే ఓ లాల
కుందిని దంచే నాతి దరువుకే గాజులు పాడే ఓ లాల గాజులు పాడే ఓ లాల
గంధం పూసే మెడలో తాళిని కట్టేదెవరే ఇల్లాలా కట్టేదెవరే ఇల్లాలా
మెట్టినింటిలో మట్టెలపాదం తొక్కిన ఘనుడే ఏలాల ఏలాలో ఏలాల ఏలాలో ఏలాల

దివిటీల చుక్కల్లో దివినేలు మామ సందామామ సందామామ
గగనాల రధమెక్కి దిగివచ్చి దీవించు సందామామ సందామామ
నోమీనమ్మల్లలాలో నోమన్నలాలో సందామామ సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాలబంతి సందామామ సందామామ

ఆపైన ఏముంది ఆ మూల గదిలోన ఆరు తరములనాటి ఓ పట్టెమంచం
తొలిరాత్రి మలిరాత్రి పొంగల్లరాత్రి ఆ మంచమే పెంచె మీ తాత వంశం
అరవయ్యేళ్ళ పెళ్ళి అరుదైన పెళ్ళి మరలిరాని పెళ్ళి మరుడింటి పెళ్ళి
ఇరవైయ్యేళ్ళవాడు నీ రాముడైతే పదహారేళ్ళ పడుచు మా జానకమ్మ
నిండా నూరేళ్ళంట ముత్తైదు జన్మ పసుపుకుంకుమ కలిపి చేసాడు బ్రహ్మ

ఆనందమానందమాయెనే మా తాతయ్య పెళ్ళికొడుకాయెనే
ఆనందమానందమాయెనే మా నానమ్మ పెళ్ళికూతురాయెనే