తొలిప్రేమ tholiprema

ఈ మనసే సే సే సే సే నా మనసే సే సే సే సే
పరిగెడుతోంది నీకేసి, వినమంటొందీ తన ఊసే అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే
ఈ మనసే సే సే సే సే నా మనసే సే సే సే సే
ఎన్నో కలలను చూసి కన్నే కునుకొదిలేసే నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే 2
కోరుకున్న తీరాన్నే తాను చేరినా తీరిపోని ఆరాటంతొ కలవరించెనా
తనకని తిరుగుతూ చెలిజత విడువదు దొరికిన వరమది కుదురుగ ఉండదు
ఏం చేస్తే బాగుంటుందో చెప్పని వింత నసే

ఈ మనసే సే సే సే సే నా మనసే సే సే సే సే
నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశె 2
వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా వెన్నలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా
తహ తహ తరగదు అలజడి అణగదు తన సొద ఇది అని తలపులు తెలుపదు
ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏం వరసే
ఈ మనసే సే సే సే సే నా మనసే సే సే సే సే