రాక్షసుడు Rakshsudu
జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటె నాకు వెన్నెలేదీ
ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో
వెళ్ళలేను ఉండలేను ఏమికానూ
మళ్ళి మళ్ళి, ఇది రాని రోజు
చేరువైన రాయబరాలే, చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే, పాడలేని భావగీతం
ఎండల్లో వెన్నెల్లో ఏం చేద్దాం, ఒక్కరం ఇద్దరం అవుతున్నం వసంతాలు ఎన్నొస్తున్నా, కోకిలమ్మ కబురేదీ
గున్నమామి విరబూస్తున్నా, తోటమాలి జాడేదీ నా ఎదే తుమ్మెదై, సన్నిధే చేరగా
మళ్ళి మళ్ళి, ఇది రాని రోజు
కళ్లనిండ నీలి స్వప్నాలే, మోయలేని వింత మోహం దేహమున్న లేవు ప్రాణాలే, నీవు కాదా నాకు ప్రాణం
సందిట్లో ఏ మొగ్గే పూయనీ, రాగాలే బుగ్గల్లో దాగనీ గులాబీలు పూయిస్తున్న తేనెటీగ అథితేదీ
సందె మబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేదీ రేగులో నావలా, నీ జతే కోరగా
మళ్ళి మళ్ళి, ఇది రాని రోజు