ఉగాది పచ్చడి

కావాల్సిన పదార్థాలు:
తగినన్ని మామిడి ముక్కలు, 2 టీ స్పూన్ల వేప పువ్వు, 100 గ్రాముల కొత్త చింతపండు, 30 గ్రాముల బెల్లం, టీ స్పూను కారం, తగినంత ఉప్పు, అరటిపండు ముక్కలు

తయారీ విధానం:
ముందుగా కొత్త చింతపండుని ఓ గ్లాసు నీళ్లలో వేసి నానబెట్టాలి. ఆ తర్వాత చింతపండు పులుసు పిండి ఓ గిన్నెలో వేయాలి. ఈ పులుసులో సన్నగా తరిగిన మామిడి ముక్కలు, వేప పువ్వు, కారం, ఉప్పు కలపాలి. ఆ తర్వాత దానికి బెల్లం, అరటి పండు ముక్కలు కలిపితే ఉగాది పచ్చడి సిద్ధమమైనట్లే.