కవితా..ఓ..కవితా...

కవితా ఓ కవితా..
ఓ నా ప్రేమ కవితా..
ఎందుకు వ్రాయిస్తావు నాచేత..
ఈ ప్రాసభాషపదప్రయోగ జనిత..
నీ అంతులేని భాషాసాగరం లో నేనెంత ..
ఏముంది నాలో అంతటి ఘనత ..
నీ చలవేగా ఈ అల్లరి వ్రాత..
చూడు ఎందరు పడ్డారో నా వాత..
చదవలేక చస్తున్న వాళ్ళే అంతా..
ఏమీ చేయలేక .. అనలేక చూస్తున్న వాళ్ళు కొంత ..
వాళ్ళ కళ్ళ కిది అర్ధం పర్ధం లేని పిచ్చి రాత..
వాళ్ళ కేమి తెలుసు నా మది లోని వెత..
నా హృదయాన్ని ప్రేమ కోసే..నిలువుకోత..
నిజానికి నువ్వుంటే నాచెంత ..
మనశ్శాంతి నిస్తావు కొండంత..
గాయపడిన గుండెలోనే పలుకుతావు అంతా..
ఏమీ రాని మనిషితో.. వ్రాయిస్తావు అది వింత..
వ్రాయించిన ప్రతి అక్షరం తో ఆవేదన నాపుతావు ..
అలసిన మనసున కోటి ఆశలను నింపుతావు ..
వొంటరిగా వెన్నెల్లో నేనుంటే వస్తావు..
నా ఏకాకి హృదయానికి తోడై నిలుస్తావు..
నా కంట నీరు కురిపిస్తూ..
ప్రేమకవితై వెలుస్తావు..
ఓ.. నా ప్రియమైన కవితా..
నీవే లేకుంటే..
నీ ప్రేరణే లేకుంటే..
ఏమైపోదు నేను..
ఎవరూ లేని నేను ..
భాదకి నేనోర్వలేక..
ఊరడింపు లేనేలేక..
సమసి పోదు నేను..
ఈ ప్రకృతిలో.. కలసిపోదు నేను...
అందుకే మై డియర్ కవితా.. ఐ లవ్ యూ..
అండ్ ఐ లవ్ యూ ఫర్ఎవర్...