సుందర కాండ -ఎమ్ ఎస్ రామారావు

The text is too long to be displayed.
అనిలకుమారుడా రాత్రివేళలో
సూక్ష్మరూపుడై ముందుకు సాగెను
రజనీకరుని వెలుగున తాను
రజనీచరుల కనుల పడకను
పిల్లివలె పొంచి మెల్లగ సాగెను
ఉత్తర ప్రాకార ద్వారము చేరెను
లంకా రాక్షసి కపివరు గాంచెను
ఘర్జన చేయుచు అడ్డగించెను
కొండ కోనల తిరుగాడు కోతివి
ఈ పురుకి ఏ పనికై వచ్చితివి
లంకేశ్వరుని ఆనతి మీద
లంకాపురికి కావలి యున్న
లంకను నేను లంకాధి దేవతను
నీప్రాణములు నిలువున దీతును
కదలక మెదలక నిజము పలుకుమని
లంకఎదుర్కొనె కపి అతి సుందరము లంకాపురమని
ఈ మాత్రము కోపమెంకులె
లంకను చూసి వెడలి పోదులె
సింహనాదమును మారుతి చేసే
కొండంత తన కాయము చేసి
పిడికిలి బిగించె
కొండ బండల రక్కసి దొర్లె
కనులప్పగించి నోటిని తెరచె
అబలను చంపుట ధర్మముగాదని
మారుతి విడెచె లంకను దయగొని
ఓ బలభీమా వానరోత్తమా
నేటికి నీచే ఓటమందితిని
ఈ నా ఓటమి లంకకు చేటని
పూర్వము బ్రహ్మ వరమొసగెనని
రావణుడాది రాక్షసులందరు
సీతమూలమున అంతమొదెదరు
ఇది నిజమని నీదే జయమని
లంకా రాక్షసి పంపె హరీశుని
కోట గోడ అవలీలగ దాటెను

శత్రుపతనముగా వామపాదమును
ముందుగ మోపి ముందుకు సాగెను
ఆణిముత్యముల తోరణాలుగల రమ్యతరమైన
సువర్ణమయ సౌధరాజముల
ధగధగ మెరెసె సౌధరాజముల
వెన్నెలలో లంకాపురి శోభను
శోధనగా హరీశుడు గాంచెను
అప్సరసల మరపించు మదవతుల
త్రిష్టాదుల గానమాధిరిమల
వెన్నేలలో లంకా పురి శోభను


శోధనగా హరీశుడు గాంచెను
నృత్యమృదంగ గంభీర నాదికము
వీణాగాన వినోద సంకులము


లంకేశ్వరుని దివ్యభవనమది
అత్తరుపన్నీట జలకములు
కస్తూరి పునుకు దివ్యగంధములు
నిత్యపూజలు శివార్చనలు
మాసపర్వముల హోమములు
యమకుబేర వరుణ దేవేంద్రాదుల
సర్వసంపదల మించినది
విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది
బ్రహ్మవరమున కుబేరుడందినది


నేలను తాకక నిలచి ఉండునది
రావణుభవన మధ్యమున ఉండినది
మనమున తలచిన
లంకాధీశుని ప్రేమ మందిరం
రత్నఖచితమౌ హేమ మందిరం
చందన పన్నీరు పరిమళ భరితము
మత్తున శయనించు సుదతుల మోములు
పుష్పములనుకుని మూగు తుమ్మెదలు
నిమీలిత విశాల నేత్రములు
ఉత్తమకాంతల కూడి రావణుడు తారాపతి వలె వెలుగుందుచున్న


లంకేశ్వరుని దివ్యభవనమది
శోధనగా హరీశుడు గాంచెను


రావణుండు రణమున గెలిచి
ఓడించి లంకకు తెచ్చిన వారె
దివి నుండి భువికి దిగి వచ్చినది
సూర్యచంద్రులను ధిక్కరించునది
పుష్పకమను దివ్యవిమానము
పుష్పకమందు రావణభనమది
మారుతి గాంచి అచ్చెరువందె
సీతగాక వారందరు కన్నెలె
రావణు మెచ్చి వరించిన వారె
శ్రీహనుమాన్ గురుదేవుల నా ఎడ పలికిన
సీతారామకథ నే పలికెద సీతారామ కథ


ఐరావతపు దంతపు మొనలతో
పోరున పొడిచిన గంటులతో
వజ్రాయుధపు ప్రఘాతములతో
చక్రాయుధపు ప్రహరణములతో
జయపరంపర గురుతులతో
కీర్తిచిహ్నముల గుతులతో
లంకేశుడు శయనించ కాంతలతో
సీతకై వెదికె మారుతి ఆశతో
ఇనుపరాశి వలె నల్లని వాడు
తీక్షణ దృక్కుల లోహితాశుడు
రక్తచందన చర్చిత గాత్రుడు
సంధ్యారుణ ఘన తేజోవంతుడు
సతులగూడి మధు గ్రోలిన వాడు
రతికేళిసల్పి సోలిన వాడు
లంకేశుడు శయనించ కాంతలతో
సీతకై వెదికె మారుతి ఆశతో
అందొక వంక పర్యంకం చేరి
నిదురించుండె దివ్యమనోహరి
నవరత్నఖచిత భూషణధారిణి
నలువంకలను కాంతి ప్రసారిణి
స్వర్ణ దేహిని చారు రూపిణి
రాణులకు రాణి పట్టపు రాణి
మండోదరి లోకోత్తర సుందరి
మండోదరిని జానకి అనుకుని
ఆడు పాడుచు గంతులు పెట్టి
వాలము పట్టి ముద్దులు పెట్టెను
నేలను కొట్టి భుజములు తట్టి
స్థంభములెగసి కిందకు దుమికి
పల్లకీలు మోసి చెంగునదూకి
చంచలమగు కపీశ స్వభావమును
పవన తనయుడు ప్రదర్శన జేసెను
రాముని సీత ఇటులుండునా
రాముని బాసి నిదురించునా
రావణుజేరి శయనించునా
భుజియించునా భూషణములుదాల్చునా
పరమపురుషుని రాముని మరచునా
పరపురుషునితో కాపురముండునా


సీతకాదు కాదు కానేకాదని
మారుతి వగచుచు వెదకసాగెను
పోవగరాని చోటులబోతిని
చూడగరానివెన్నో జూసితి
నగ్నముగా పరుడిన పరకాంతల
పరిశీలనగా పరికించితిని
రతికేళి సలిపి సోలిన పడతుల
ఎందెందరినో పరికించితిని
ధర్మముగానక పాపినయితినని
మారుతి వగచుచు వెదకసాగెను
సుదతులతోడ సీత ఉండగా
వారిని చూడక వెదుకటెలాగా
మనసున ఏమీ వికారమునొందక
నిష్కామముగా వివేకము వీడక
సీతను వెదకుచు చూసితిగాని
మనసున ఏమీ పాపమెరుగనని
స్వామిసేవ పరమార్ధముగాగొని
మారుతి సాగెను సీతను గనుగొన
భూమిగృహములు నిషాగృహములు
క్రీడాగృహములు లతాగృహములు
ఆరామములు చిత్రశాలలు
బావులు తిన్నెలు రచ్చవీధులు
మేడలు మిద్దెలు గిరులు కోనేరులు
సందులు గొందులు కోటలు పాటలు
ఆగి ఆగి అడుగు అడుగు వెదకుచు
సీతనుగానక మారుతి వగిచె
సీతామాతా బ్రతికి ఉండునో
కౄర రాక్షసుల పాల్పడి ఉండునో
తాను పొందని సీత ఎందుకని
రావణుడే హతమార్చి ఉండునో
అని యోచించుచూ అంతట వెదకుచు
తిరిన తావున తిరిగి వెదకుచూ
ఆగి ఆగి అడుగు అడుగు వెదకుచు
సీతనుగానక మారుతి వగచెను
సీతజాడ కనలేదను వార్తను
తెలిసిన రాముడు బ్రతుకజాలడు
రాముడు లేక లక్ష్మణుడుండడు
ఆపై రఘుకుమంతరించును
ఇంతటి ఘోరము కనలేని
సుగ్రీవాదులు బ్రతుకజాలరు
ఇంత ఘోరము నా వల్లనేను
నే కిష్కిందకు పోనే పోను
వానప్రస్థాశ్రమ వాసుడనై

నియమ నిష్టలతో బ్రతుకువాడను
సీతామాతాను చూచితీరెదను
లేకున్న నేను అగ్నిదూకెదను
అని హనుమంతుడు కృతనిశ్చయుడై
నలుదెశలగనె సాహసవంతుడై
చూడమరచిన అశోకవనిలో
చూచువేళలో మారితి గాంచెను
సీతారామా లక్ష్మణాదులకు
ఎకాదశ రుద్రాదిదేవతలకు
ఇంద్రాది యమ వాయుదేవులకు
సూర్యచంద్ర మరుద్గణములకు
వాయునందనుడు వందనములిడి
అశోకవని చేరెను వడి వడి
శ్రీహనుమాన్ గురుదేవులు నా ఎడ
పలికిన సీతారామకథ
నే పలికెద సీతారామ కథ
విరితేనియలు గ్రోలు తుమ్మెదలు
విందారగ జేయు ఝంకారములు
లేజివురాకుల నెశవు కోయిలలు
పంచమాశ్వరమున పలికే పాటలు
పురులు విప్పి నాట్యమాడు నెమళులు
కిలకిలలాడే పక్షుల గుంపులు


సుందరమైన అశోకవనమున
మారుతి వెదెకె సీతను గనుగొన


అన్ని విధముల అనువైనదని
అశోకవనమున సీత ఉండునని
కపికిశోరుడు కొమ్మకొమ్మను
ఊపుచు ఊపుచు చూడసాగెను
పూవులు రాలెను తీగెలు తెగెను
ఆకులు కొమ్మలు నేలపై బడెను
పూవులు రాలగా పవన కుమారుడు
పుష్పరధమువలె వనమున దోచెడు
సుందరమైన అశోకవనమున
మారుతి వెదెకె సీతను గనుగొన


పూవులనిన పూదేనిలనిన
జానకికెంతో మనసౌనని
పద్మపత్రముల పద్మాక్షుణిగన
పద్మకరముల చెంతజేరునని
అన్ని విధముల అనువైనదని
అశోకవనమున సీత ఉండునని


ఉపవాసముల వాడిపోయిన
నివురుగప్పిన నిప్పుకణికను
మాసిన పీతవసము గట్టిన
మన్నున చిక్కిన పద్మమును
పతివియోగ శోకాగ్ని నివురుగప్పున నిప్పుకణికను


మాటి మాటికి వేడి నిట్టూర్పుల
సెగలను గ్రక్కే అగ్నిజ్వాలను
రతీదేవి వలె మెరయు కాంతను


పుణ్యము తరిగి దివి నుండి జారి
శోఖజలధిన మునిగిన తారను
రాక్షసవనితల క్రూర వలయమున
పతి చెంతలేని సతికేలనని
సీత సొమ్ముల తగించె శాఖల
మణిమయ కనక కర్ణవేష్టములు
మరకత మాణిక్య చంపసరాలు
నవరత్న ఖచిత హస్థ భూషలు
సర్వసులక్షిత లక్షిత జాత
ఆహాకంటి కనుగొంటి సీతనని
పొంగి పొంగి ఉప్పొంగె మారుతి
పూవుల నిండిన వనములందున
నాగేటిచాలున జననమందిన
జనకమహారాజు కూతురైన
దశరధ నరపతి కోడ్సలైన
సీతాలక్ష్మికి కాదు సమానము
త్రైలోక రాజ్య లక్ష్మీ సహితము
అంతటి మాతకా కాని కాలమని
మారుతి వగచెను సీతను గనుగొని
శతృతాపహరుడు మహాశూరుడు
సౌమిత్రికి పూజ్యురాలైన
ఆశ్రితజన సంరక్షకుడైన
శ్రీరఘురాముని ప్రియసతి అయిన
పతిసన్నిద్ధియే సుఖమని ఎంచి
పదునాలుగేళ్ళు వనముకు ఏగిన
బంగరు మేని కాంతులు మెరియ
మందస్మిత పద్మము విరియ
హంసతూలికా తల్పము పైన
రాముని కూడి సుఖింపగ తగిన
పురుషోత్తముని పావన చరితుని
రాముని కూడి సుఖింపగ తగిన
అంతటి మాతకా కాని కాలమని
మారుతి వగచెను సీతను గనుగొని
మూడు ఝాముల రేయిగడవగా
నాల్గవఝాము రేయి నడచుచుండగా
మంగళవాద్య మనోహర ధ్వనులు
లంకేశ్వరుని మేలుకొలుపులు
క్రతులొనర్చు తరంగ వేదవిధుల
తొరయుటచేత తరంగ ఘోషలు
శోభిల్లు శుంచుకశాఖలందున
మారితి కూర్చుని ఆలకించెను
రావణాసురుడు శాస్త్రోక్తముగా
వేకువనే విధులన్ని యొనర్చెను
మదోత్కటుడై మదన తాపమున
మరి మరి సీతను మదిలో నెంచెను
నూర్వురు భార్యలు సురకన్నెల వలె
పరిసేవింపగా దేవేంద్రుని వలె
దశకంఠుడు దేదీప్యమానముగా
వెడెలెను అశోక వనము చేరగా
లంకేశునితో వెడెలెను సతులు
మేఘము వెంట విద్యులతల వలె
మధువు గ్రోలిన పద్మముఖుల
ముంగురులెగిరె భ్రుగములవలె
క్రీడల తేలిన కామినీ మణుల
నిద్రలేమి కడు అడుగులు తూలె
దశకంఠుడు దేదీప్యమానుడై
చేరెను అశోకవనము వేగముగ
లంకేశుని మహాతేజమును గని
మారుతి కూడా విభ్రాంతి చెందెను


దశకంఠుడు సమీపించి నిలిచెను
సీత మీదనే ఉడుపులు నిలిపెను
వడలు చేర్చుకుని కడుపును దాచి
కరములు ముడిచి చనుగవ దాచి
సుడిగాలి పడిన కదళీ తరువు వలె
కఠిన నేలపై జానకి తూలె
ఓ సీతా ఓ పద్మనేత్ర
నా చెంత నీకు ఏలా చింత
ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య
ఎవరికోసమీ వనవాస వ్యధ
నవయవ్వన త్రిలోక సుందరీ
నీ కెందుకీ మునివేషధారణ
అని రావణుడు కామాంధుడై నిలిచె
నోటికి వచ్చినదెల్ల పలికె
రాముడు నీకు సరికాని వాడు
నిను సుఖపెట్టడు తను సుఖపడడు
మతిచెడి వనమున తిరుగు చుండెనో
తిరిగి తిరిగి తుదకు రాలిపోయెనో
మరచిపొమ్ము ఆ కొరగాని రాముని
వలచి రమ్ము నను యశోవిశాలుని
అని రావణుడు కామాంధుడై నిలిచె
నోటికి వచ్చినదెల్ల పలికె