Musings
Public · Protected · Private
గాయం gaayam
-
2008-01-11 17:26నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని మారదు లోకం ..మారదు కాలం దేవుడు దిగి రానీ ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం ..మారదు కాలం ! గాలి వాటు గమనానికి కాలిబాట దేనికి గొర్రెదాటు మందకి మీ జ్ఞానబోధ దేనికి ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం రామబాణమార్పిందా రావణ కాష్ఠం కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని మారదు లోకం ..మారదు కాలం ! పాత రాతి గుహలు పాల రాతి గౄహాలయినా అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా వేట అదే..వేటు అదే..నాటి కధే అంతా నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం ..మారదు కాలం ! దేవుడు దిగి రానీ..ఎవ్వరు ఏమై పోనీ మారదు లోకం ..మారదు కాలం !!
-
2008-01-11 17:28సురాజ్యమవలేనీ స్వరాజ్యమెందుకనీ సుఖాన మనలేనీ వికాసమెందుకనీ నిజాన్ని బలి కోరే సమాజమెందుకనీ అడుగుతోంది అదిగో..ఎగిరే భరత పతాకం ! ఆవేశంలో ప్రతినిమిషం..ఉరికే నిప్పుల జలపాతం కత్తికొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలూ భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే శిరసువంచెనదిగో.. ఎగిరే భరత పతాకం ! చెరుగుతుంది ఆ తల్లి చరితలో విశ్వ విజయాల విభవం !! సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ సుఖాన మనలేని వికాసమెందుకనీ కులమతాల దవానలానికి కరుగుతున్నది మంచుశిఖరం కలహముల హాలాహలానికి మరుగుతున్నది హిందుసంద్రం దేశమంటే మట్టికాదను మాట మరచెను నేటి విలయం అమ్మ భారతి బలిని కోరిన రాచకురుపీ రాజకీయం విషము చిమ్మెను జాతి తనువునా... ఈ వికృత గాయం !
-
2008-01-13 17:22Other good one
This blog is frozen. No new comments or edits allowed.