Musings
Public · Protected · Private
రాముడు భీముడు ramudu bhimudu
-
2008-01-16 11:59సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ పట్టుబట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికి యిది తొలి మెట్టు కంపు గొట్టు యీ సిగరెట్టు దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు కడుపు నిండునా కాలు నిండునా వదిలి పెట్టవోయ్ నీ పట్టు ఈ సిగిరెట్టుతో ఆంజనేయుడూ లంకా దహనం చేశాడూ ఎవడో కోతలు కోశాడూ ఈ పొగ తోటీ గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చూ మీసాలు కాల్చుకోవచ్చూ ఊపిరి తిత్తులు క్యాన్సరుకిదియే కారణమన్నారు డాక్టర్లూ కాదన్నారులే పెద్ద యాక్టర్లూ పసరు బేరుకొని కఫము జేరుకొని ఉసురు తీయు పొమ్మన్నారూ దద్దమ్మలు అది విన్నారూ ప్రక్కనున్న వాళ్ళీ సువాసనకుముక్కు ఎగరేస్తారు నీవెరుగవు దీని హుషారు థియేటర్లో పొగ త్రాగడమే నిషేధించినారందుకే కలెక్షన్లు లేవందుకే కవిత్వానికి సిగిరెట్టుకాఫీకే యిది తొలిమెట్టు. పైత్యానికి యీ సిగిరెట్టు బడాయి క్రిందా జమకట్టూ ఆనందానికి సిగిరెట్టు ఆలోచనలను గిలకొట్టు పనిలేకుంటే సిగిరెట్టూ తిని కూర్చుంటే పొగపట్టూ రవ్వలు రాల్చే రాకెట్టూ రంగు రంగులా ప్యాకెట్టూ కొంపలు గాల్చే సిగిరెట్టూ దీని గొప్ప చెప్ప చీదర బుట్టూ
-
2008-01-16 12:01సరదా సరదా సిగిరెట్టూ
This blog is frozen. No new comments or edits allowed.