Public · Protected · Private
గుడి గంటలు gudigantalu
Type: Public  |  Created: 2008-01-16  |  Frozen: Yes
« Previous Public Blog Next Public Blog »
Comments
  • జన్మ మెత్తితిరా.. అనుభవించితిరా
    2008-01-16 12:14
  • జన్మమెత్తితిరా అనుభవించితిరా

    బ్రతుకు సమరములో పండి పోయితిరా

    మంచి తెలిసి మానవుడుగా మారినానురా ||జన్మ||

    స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసెరా

    బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా || స్వార్థ ||

    దైవ శక్తి మృగత్వమునే సంహరించెరా || దైవ ||

    సమర భూమి నా హృదయం శాంతి బొందెరా ||జన్మ||

    క్రోధ లోభ మోహములే పడగలెత్తెరా

    బుసలు కొట్టి గుండెలోన విషము గ్రక్కెరా ||క్రోధ||

    ధర్మ జ్యోతి తల్లివోలె ఆదరించెరా ||ధర్మ ||

    నా మనసె దివ్య మందిరముగా మారిపోయెరా

    మట్టి యందె మాణిక్యం దాగి యుండురా

    మనిషి యందె మహాత్ముని కాంచగలవురా ||మట్టి||

    ప్రతి గుండెలో గుడి గంటలు ప్రతిధ్వనించురా ||ప్రతి||

    ఆ దివ్య స్వరం న్యాయ పధం చూపగలుగురా ||జన్మ||

    2008-06-03 23:00
This blog is frozen. No new comments or edits allowed.