గీతాంజలి geethanjali

ఆమని పాడవే హాయిగా..
మూగవై పోకు ఈ వేళ..
రాలేటి పూవులా రాగాలతో
పూసేటి పూవులా గంధాలతో
మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా
ఆమని||

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా
పదాల నాయద స్వరాల సంపద
తరాల నా కధ క్షణాలదే కదా
గతించి పోవు గాధ నేనని
ఆమని||
శుఖాలతో పికాలతో ధ్వనించినా మధోదయం
దివి భువి కలా నిజం స్పృశించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరినా ఉగాది వేళలో
గతించి పోని గాధ నేననీ
ఆమని||
ఒ పాపా లాలీ
జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తీయగా…
ఒ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి
పాడనా…ఒ పాపా లాలీ

నా జోలలా లీలగా తాకాలని
గాలినే కోరనా జాలిగా…
నీ సవ్వడే సన్నగాఉండాలని
కోరనాగుండేనే కోరికా…
కలలారని పసి పాప తల వాల్చిన వొడిలో
తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకిది నా మనవి

ఓ పాపా లాలి||

ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి
గాలిలో… తెలిపో వెళ్ళిపో …
ఓ కోయిలా పాడవే నా పాటని…
తీయని… తెనేలే… చల్లిపో…
ఇరు సందెలు కదలాడే యద ఊయల ఒడిలో
సెలయేరుల అల పాటే వినిపించని గదిలో
చలి ఎండకు సిరివెన్నలకిది నా మనవీ…

ఒ పాప లాలి జన్మకే లాలి ||
ప్రేమకే లాలి పాడనా తీయగా…
ఒ పాప లాలి ||

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం
మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం
మా పిలుపే ఢమరుఖం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు ప్రిక్కటిల్లిపోయే రంపంపం
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం మా పిలుపే ఢమరుఖం

చరణం1:

ఆడేదే వలపు నర్తనం పాడేదే చిలిపి కీర్తనం
సై అంటే సయ్యాటలో హేహే
మా వెనకే వుంది ఈ తరం మా శక్తే మాకు సాధనం
ఢీ అంటే ఢియ్యాటలో
నేడేరా నీకు నేస్తము రేపే లేదు
నిన్నంటే నిండు సున్న రా రానే రాదు
ఏడేడు లోకాల తోన బంతాట లాడాలి ఈనాడే
తక తకదిమి తకజను

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం మా పిలుపే ఢమరుఖం

చరణం2:

పడనీరా విరిగి ఆకశం విడిపోనీ భూమి ఈ క్షణం
మా పాట సాగేనులే హో హో
నడిరేయే సూర్య దర్శనం రగిలింది వయసు ఇంధనం
మా వేడి రక్తాలకే
ఓ మాట ఒక్క బాణము మా సిధ్ధాంతం
పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం
జోహారు చేయాలి లోకం మా జోరు చూసాక ఈనాడే
తక తకదిమి తకజను

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం మా పిలుపే ఢమరుఖం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు ప్రిక్కటిల్లిపోయే రంపంపం
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే - 2
ఉరుకులో పరుగులో
ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు

తొలకరి మెరుపులా
ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే --2



వాగులు వంకలు జలజలా చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు కొండమల్లి లేనివంక ముద్దులాడి
వెల్లడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి


జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే -2

ఉరుకులో పరుగులో ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే 2



సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తొలితొలి వయసులే తెలియని తపనలే తెలుపగా
వానదేవుడే కళ్ళాపి జల్లగా
వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికోసమో

జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే -2

ఉరుకులో పరుగులో ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే -2