ఘర్షణ gharshana

రాజా రాజాధి రాజాధి రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ -2
నిన్న కాదు నేడు కాదు ఎప్పుడూ నే రాజా -2
కోట లేదు పేటా లేదు అప్పుడూ నే రాజా
రాజా రాజాధి రాజాధి రాజా ...

ఎదురూ లేదు బెదురూ లేదు ,లేదు నాకు పోటి
లోకం లోనా లోకుల్లోనా నేనే నాకు సాటి -2

ఆడి పాడేనులే అంతు చూసేనులే చెయ్యి కలిపేనులే చిందులేసేనులే
చీకు చింతా లేదు ఇరుగూ పొరుగూ లేదు ఉన్నది ఒకటే ఉల్లాసమే - 2

నింగీ నేల నేరు నిప్పు గాలి ధూలి నాకే తోడు

రాజా రాజాధి రాజాధి రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ -2
నిన్న కాదు నేడు కాదు ....


రైకా కోకా రెండూ లేవు అయినా అందం ఉంది
మనసు మంచి రెండూ లేవు అయినా పరువం ఉంది -2
కలలూరించెనే కథలూరించెనే కళ్ళు వలవేసెనే ఒళ్ళు మరిచేనులే
వన్నెల పొంగులు కలవి మత్తుగ చూపులు రువ్వి రచ్చకు ఎక్కే రాచిలుకలే -2

నింగీ నేల నేరు నిప్పు గాలి ధూలి నాకే తోడు
రాజా రాజాధి రాజాధి రాజా ....
ఒక బ్రుందావనం సోయగం యద కోలాహలం క్షణక్షణం
నే...మనసు పడిన వేంటనే
ఒక బృందావనం సోయగం...
యద కోలాహలం క్షణ క్షణం...
ఒకే స్వరం.. సాగేను తీయగా
ఒకే సుఖం.. విరిసేను హాయిగా

లే సందెవేళ జాబిలీ.. నా గీత మాల ఆమనీ...
నా పలుకు తేనె కవితలే.. నా పిలుపు చిలక పలుకులే..
నే కన్న కలల నీడ నందనం ... నా లోని వయసు ముగ్ధ మోహనం...
ఒకే స్వరం...సాగేను తీయగా ... ఒకే సుఖం.. విరిసేను హాయిగా
ఒక బృందావనం ||

నే మనసు పడిన వెంటనే... ఓ ఇంధ్రధనుసు పొంగునే...
ఈ వెండి మేఘమాలలే.. నా పట్టు పరుపు చెయనే..
నే సాగు బాట జాజి పూవులే ... నాకింక సాటి పోటి లేదులే..
ఒకే స్వరం...సాగేను తీయగా ... ఒకే సుఖం.. విరిసేను హాయిగా
ఒక బృందావనం ||