ఇంటింటి రామాయణం intinti ramayanam
తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల
చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా
ఊపిరి తగిలిన వేళ నే ఒంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే పలికే రాగమాల
ఆ ఆ ఆ ఆ లలలా ఆ ఆ
చూపులు రగిలిన వేళ
ఆ చుక్కలు వెలిగిన వేళ
నా తనువున అణువణువున
జరిగే రాసలీల ఆ ఆ
వీణ వేణువైన సరిగమ విన్నావా
తీగ రాగమైన మధురిమ కన్నావా
చరణం2:
ఎదలో అందం ఎదుట
ఎదుటే వలచిన వనిత
నీ రాకతో
నా తోటలో
వెలసే వన దేవతా
కదిలే అందం కవితా
అది కౌగిలికొస్తే యువతా
నా పాటలో నీ పల్లవే
నవతా... నవ్య మమత ఆ ఆ
వీణ వేణువైన ||
తనువు తహతహలాడాల
చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా
తీగ రాగమైన మధురిమ కన్నావా
వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము
విడిపోతే కల్లోలము -2
సీతమ్మా చిలకమ్మా ,రామయ్య గోరింక
వలపుల తలపుల సరాగం
ఇంటింటి రామాయణం||
నీవుంటే నందనవనము లేకుంటే అశోకవనము-2
నీవాడే ఊసులన్ని రతనాల రాశులే
నీవుంటే పూలబాట లేకుంటే రాళ్ళబాట-2
నీతోటి ఆశలన్నీ సరసాల పాటలు ముత్యాల మూటలు
అల్లల్లే ఎహే
ఇంటింటి రామాయణం||
అ సిరిమల్లే అ పొదరింట
చిలకమ్మ,గోరింక సిరిమల్లే పొదరింట నవ్వాలి నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి
ఇంటింటి రామాయణం||
సరి అంచు చీరలు తెస్తా కవరింగు సరుకులు పెడతా-2
తెమ్మంటే మాయలేడి తేలేనే నిన్నొదిలి
ఓ ఓ ఓ ఓ ఒహొహొహొహొ హొయ్
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
కీచులాడుకున్న నువ్వు రోషమొచ్చి పోకురా కలిసి మెలిసి ఉండరా
ఇంటింటి రామాయణం -2
ఇల్లేకద స్వర్గసీమ ఇద్దరిది చెరగని ప్రేమ -2
కలతలేని కాపురాన కలలన్ని పండాలి
అహహహహ మోజున్న ఆలుమగలు కులకాలి రేయిపగలు
మోజున్న ఆలుమగలు కులకాలి రేయిపగలు
మన ఇద్దరి పొందికచూసి ఈ లోకం మెచ్చాలి దీవెనలే ఇవ్వాలి
ఇంటింటి రామాయణం ||