అభినందన abhinandana
నవ శిల్పానివో.. రతి రూపానివో.. తొలి ఊహల ఊ.యలవో..
రంగులలో కలవో ఎద పొంగులలో కళవో
కాశ్మీర నందన సుందరివో 2
కైలాsa మందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో ఆ ఆ- 2
మరుని బాణమో.. మధు మాస గానమో..
నవ పరిమళాల పారిజాత సుమమో
రంగులలో కలనై ఎద పొంగులలో కళనై నవ శిల్పాంగినై రతి రూపాంగినై
నీ ఊహల ఊగించనా రంగులలో కలనై
ముంతాజు అందాల అద్దానివో-2
షాజాను అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో -2
ప్రణయ దీపమో నా విరహ తాపమో
నా చిత్ర కళా చిత్ర చైత్ర రధమో
రంగులలో కలనై ||
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
మరుపే తెలియని నా హృదయం తెలిసీ వలచుట తొలి నేరం
అందుకె ఈ గాయం -2
గాయాన్నైనా మాన నీవు హృదయాన్నైనా వీడి పోవు
కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు
పిచ్చి వాణ్ణి కానీదు
ఎదుటా నీవే||
కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను -2
స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నం అయ్యేదుందా
ప్రేమకింత బలముందా
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో -2
మంచు కురిసే వేళలో ||
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో -2 జలకమాడి పులకరించే సంబరంలో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో -2 ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో
మంచు కురిసే వేళలో ||
మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో -2 మన్మధునితో జన్మ వైరం సాగినపుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో -2 మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో
మంచు కురిసే వేళలో ||
కధైనా కలైనా కనులలో చూడనా
అదే నీవు ||
కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము -2
గువ్వా గువ్వ కౌగిళ్ళో గూడుచేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము -2 ఆది అంతము ఏదీ లేని గానము
అదే నీవు ||
నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు -2 కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు
అదే బాసగా అదే ఆశ గా -2 ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటే పాడను
అదే నీవు ||