ఛాలెంజ్ challenge

ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జఘన సొగసు లలనవే -2
తొలి వలపే తెలిపే చిలిపి సిగ్గేలనే చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే
ఐ లవ్ యూ ఓ హారికా ...నీ ప్రేమకే జోహారిక .-2
ఇందువదన ||

కవ్వించే కన్నులలో కాటేసే కలలెన్నో
పకపక నవ్వులలో పండిన వెన్నెలవై నన్నందుకో
కసి కసి చూపులతో కొసకొస మెరుపులతో నన్నల్లుకో
ముకుళించే పెదవుల్లో మురిపాలు
ఋతువుల్లో మధువంతా సగపాలు
సాహోరే ..భామా ..హొయ్

ఇందువదన ||

మీసంలో మిసమిసలు మోసాలే చేస్తుంటే
బిగిసిన కౌగిలిలో సొగసరి మీగడలే దోచేసుకో
రుస రుస వయసులతో ఎడదల దరువులతో ముద్దాడుకో
సరిపొద్దు వెంకన్న సరసాలు పగపట్టి పరువంతో ప్రణయాలు
జోహారే ||
ఇందువదన కుందరదన ||