డాన్స్ మాస్టర్ dance master

రేగుతున్నదొక రాగం యదలో సొదలా
రేపుతున్నదొక మోహం నదిలో అలలా
కన్నులే ముద్దు లాడగా
తారలే కన్ను గీటగా కసిగా.

చెక్కిళ్ళల్లో ముద్దు చెమ్మ తడి ఆరకున్నదీ
నీ కళ్ళలో నీటి బొమ్మ కదలాడిందే...
తెలిపింది కన్నె గళమే మనువాడలేదనీ
ఓ పువ్వు పూసింది ఒడిలో తొలి ప్రేమల్లే.
మెలకువే స్వప్నమై మెలితిరిగెను నాలొ
ఒరిగినా ఒదిగినా హత్తుకొనే ప్రేమా
నీ.. పిలుపే..పిలిచే..వలపై... పెదవుల్లో..దాగీ...

రేగుతున్నదొక||
రానేలా ..వసంతాలే
శ్రుతి కానేల సరాగాలే
నీవేనా జీవన రాగం స్వరాల బంధం
నీవేనా యవ్వన కావ్యం స్మరించే గీతం

రానేల ||

ఈ మౌన పంజరాన నే మూగనై నీ వేణువూదగానే నీ రాగమై
ఇగిరే శోకమై విరిసే తోటనై ఏ పాట పాడిన అది పూవులై
అవి నేల రాలిన చిరు తావినై బదులైన లేని ఆశలారబోసి

రానేల ||

ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా ఈ చెలిమిని ఇపుడే దరి చేర్చవా
రగిలే తాపమే ఎదలో తీరగా నీ చూపు తోనే చలి తీరగా
నీ స్పర్శ తోనే మది పాడగా ఎద మీటి పోయే ప్రేమగీతిలాగా

రానేల||