ప్రేమనగర్ Prema Nagar
మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికీ సుఖము లేదంతే -2
మనసుగతి ఇంతే
ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచి పోదు -2
గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకు పడదు
మనసుగతి ఇంతే||
అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయెనని తెలుసు -2
తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు
మనసుగతి ఇంతే ||
మరు జన్మ వున్నదో లేదొ ఈ మమత లప్పుడే మౌతాయొ
మనిషికి మనసే తీరని శిక్షా దేవుడిలా తీర్చుకుమన్నాడు కక్షా
మనసుగతి ఇంతే ||