సితార sitara

కిన్నెరసాని వచ్చిందమ్మా
వెన్నెల పైటేసి ||కిన్నెరసాని||

విశ్వనాథ పలుకై
అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కులుకై
అది కూచిపూడి నడకై
పచ్చని చేల పావడ కట్టి
కొండ మల్లెలే కొప్పున పెట్టి
వచ్చే దొరసాని ….
మా వన్నెల కిన్నెరసాని ||కిన్నెరసాని||

ఎండల కన్నే సోకని రాణి
పల్లెకు రాణి పల్లవ పాణి
కోటను విడచి పేటను విడచి-2

కనుల గంగ పొంగే వేళ
నదిలా తానే సాగే వేళ
రాగాల గోదారి పూదారి ఔతూంటే-2

కిన్నెరసాని||

మాగాణమ్మ చీరలు నేసె
మలిసందెమ్మా కుంకుమ పూసె
మువ్వల బొమ్మ ముద్దుల గుమ్మా -2

గడప దాటి నడిచే వేళ
అదుపే విడీచి ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తూంటే
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తూంటే
కిన్నెరసాని||