ఆస్తులు అంతస్థులు astulu anthastuku

మిడిసిపడే దీపాలివి.. మిన్నెగిసిపడే కెరటాలివి
మిడిసిపడే దీపాలివి.. మిన్నెగిసిపడే కెరటాలివి
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు-2
ఈ జీవితమే ఒక గమ్యం లేని నావ సుఖ దుఖాలే ఏకమైన రేవులో
మిడిసిపడే దీపాలివి-2


బావి లోతు ఇంతని తెలుసు నదుల లోతు కొంతే తెలుసు
ఆడ గుండె లోతు ఎంతో లోకం లో ఎవరికి తెలుసు
ఏ నిముషం ప్రేమిస్తుందో ఏ నిముషం పగబడతుందో
ఎప్పుడెలా మారుతుందో తెలిసిన మగవాడు లేడు
రాగం అనురాగం ఎర వేసి జత చేరి
కన్నీట ముంచుతుందిరా

మిడిసిపడే దీపాలివి ||


పాము విషం సోకిన వాడు ఆయువుంటే బతికేస్తాడు
కన్నె వలపు కరిచిన వాడు నూరేళ్ళకి తేరుకోడు
సొగసు చూసి మనసిచ్చావా బందీగా నిలబడతావు
నీ కలలే విరిగిననాడూ కలతే నీ తోడవుతుంది
లేదు ఏ సౌఖ్యం రవ్వంత సంతోషం ఈ ఆడదాని ప్రేమలో


మిడిసిపడే దీపాలివి -2


ఈ జీవితమే ఒక గమ్యం లేని నావ
సుఖ దుఖాలే ఏకమైన రేవులో
మిడిసిపడే దీపాలివి
మిన్నెగిసిపడే కెరటాలివి
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు -2