రోజా roja
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడ ఆశ
వెన్నలకు తోడై ఆడుకోను ఆశ
ఛిన్ని ఛిన్ని ఆశ
పూవులా నేను నవ్వుకోవాలి
గాలినే నేనై సాగిపోవాలి
చింతలే లేక చిందులేయాలి
వెడుకలలోనా తేలిపోవాలి
తూరుపు రెఖ వెలుగుకావాలి
ఛిన్ని ఛిన్ని ఆశ
చేనులో నేనే పైరుకావాలి
కొలనలో నేనే ఆలను కావాలి
నింగి హరివిల్లు వంచిచూడాలి
మంచు తెరలోనె నిదురపోవాలి
చైత్ర మాసంలో చినుకు కావాలి
ఛిన్ని ఛిన్ని ఆశ
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే యెదలోనిండేవే
కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే
గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం
అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం
మేఘమాల సాగితే మొహ కధలు జ్ఞాపకం
మనసులేకపోతె మనిషి ఎందుకంట
నీవులేకపోతె బతుకు దండగంట
కనిపించవో అందించవో తోడు
నా చెలి రోజావే ||
చెలియ చెంత లేదులే చల్లగాలి ఆగిపో
మమత దూరమాయెనె చందమామ దాగిపో
కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో
తోడులేదు గగనమా చుక్కలాగ రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
వీడిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు
నా చెలి రోజావే ||
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనె ఆ సడిలోన ఒక తోడు యద కోరెనే-2
నదివీ నీవైతే అలనేనే ఒక పాటా నీవైతే నీరాగం నేనే
పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే
నీ పాల పొంగుల్లొ తేలనీ నీ గుండెలొ నిండనీ
నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లొ కొలువుండనీ
పరువం వానగా నేడు కురిసేనులే ||
నీ గారల చూపులే నాలో రేపేను మోహం
నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం
నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో
నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకొ
పరువం వానగా నేడు ||