kids songs
ఒలవనిపండు ఒళ్ళోఉంచుకొని ఒల్చిన పండు చేతబుచ్చుకుని
వెండిగిన్నెలో వెన్న పెట్టుకొని పమిడిగిన్నెలో పాలు పోసుకొని
అమ్మా, నువ్వూ తిందూగాని అట్టా అట్టా రావె
చందమామా !
వెండిగిన్నెలోన వెన్నయు నేయి పోసి పమిడిగిన్నెలోన పాలుపోసి
చందమామరావె జాబిల్లిరావె
మా చిన్నిబిడ్డతో భుజింతుగాని. జేజేలకును బువ్వ శివునియౌదల పువ్వ
జాబిల్లి రాగదే చందమామ మెండుచీకటి దొంగ మెఱయుచుక్క బొజుంగ
జాబిల్లిరాగదే చందమామ
చిగురుకైదువుకామ చెలగురావుతుమామ జాబిల్లిరాగదే చందమామ
చిన్నయన్నకు శ్రీ రఘుశేఖరునకు వెండిగిన్నియలోపల వెన్నపోసి
పమిడిగిన్నియలోపల పాలుపోసి చాల దినిపించి పోగదే చందమామ !
పిల్లమ్మ కన్నుల్లు బీరపువ్వుల్లు అబ్బాయి కన్నుల్లు కలువరేకుల్లు
కలువరేకులవంటి నీ కన్నులకును కాటుకలుపెట్టితే నీకు అందమ్ము
ఏడువకు ఏడువకు వెఱ్ఱి అబ్బాయి ఏడుస్తె నీ కళ్ళు నీలాలు కారు
నీలాలు కారితే నే జూడలేను పాలైన కారవే బంగారు కళ్ళ.
నీ పుల్ల పోదు
ఉడకకే ఉడకకే ఓ ఉల్లిపాయ నువ్వెంత ఉడికినా
నీ కంపు పోదు
పప్పుపెట్టి, పాయసంపెట్టి, అన్నంపెట్టి, అప్పచ్చిపెట్టి,
కూరపెట్టి, ఊరగాయపెట్టి, నెయ్యివేసి, ముద్దచేసి,
తినిపించి, తినిపించి, చేయిగడిగి, మూతిగడిగి,
తాతగారింటికి దారేదంటే, ఇట్లాపోయి, ఇట్లాపోయి,
మోచేతిపాలెం ముందర్నించి,
ఇట్లాపోయి, ఇట్లాపోయి, ఇదిగో ఇదిగో, వచ్చాం వచ్చాం,
చక్కా వచ్చాం, చక్కా వచ్చాం, చక్కిలిగిలిగిలి, చక్కిలిగిలిగిలి.
గుమ్మాడమ్మా గుమ్మాడీ, ఆకుల్లువేసింది గుమ్మాడీ,
పూవుల్లు పూసింది గుమ్మాడీ, పండ్లు పండిందమ్మ గుమ్మాడీ,
అందులో ఒకపండు గుమ్మాడీ, అతి చక్కనీ పండు గుమ్మాడీ,
ఆ పండు యెవరమ్మ గుమ్మాడీ, మా చిట్టి తండ్రమ్మ గుమ్మాడీ !
సీతమ్మ వాకిటా చిరుమల్లె చెట్టు
చిరుమల్లె చెట్టేమొ చితుకచూసింది
చెట్టు కదలాకుండ కొమ్మవంచండి;
పట్టి పూవులుకోసి బుట్ట నింపండి
అందులో పెద్దపూలు దండ గుచ్చండి,
దండ తీసుకువెళ్ళి సీత కివ్వండి.
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ
దాచుకోకుంటేను దోచుకొంటారు
దొడ్డి గుమ్మములో న దొంగలున్నారు.