మహాసంకల్పం శ్రీ శ్రీ
మహాసంకల్పం
విధిగావికసించే
చరిత్రకొకకృతజ్ఞత,
ప్రజలకునివాళి,
ప్రభవించిననూతనభారత
పతాకకభివాదం,
భవిష్యదుజ్జల
భర్మయుగానికిఆహానం,
సకలజగజ్జనులారా
ఇదిగోనా సాతంత్ర్యసప్నం:
ఏ సాతంత్ర్యంనిమిత్తం ఎవరెవరోఎందరో దేశసేవా
భాసంతుల్‌బాలవృద్ధుల్‌పతితులధికులప్రాజ్ఞులుత్ప్రజ్ఞులంతా
అసాశల్‌వీడిలాఠీహతులయిఉరికొయ్యల్‌కవుంగింటచేర్చా
రాసాతంత్ర్యం లభించిందనివిని హృదయంహ్లాదసంపుష్టమైతే
నవోదితసాధీనతానందితోత్పుల్లమైన
థగరంజెండాల పంటలతోనవుతూ పాడుతూఉంటే
ఉత్సాహప్రవాహంలో నేనూఒక బిందువునై
సాతంత్ర్యవాయువులు పీలుస్తూసాగిపోయా
ఆ సమయంలో అందరిమనస్సు
లావరించె నొకవ్యక్తి
అందరిలోనూ ఆ సమయంలో
ఆవహించెనొక శక్తి
అంతట్లోకే ఆకస్మాత్తుగా
జన సందోహంకరిగి
ఒకే వ్యక్తిగా రూపుధరిస్తే
ఇదేం చిత్రమనిచూశాను.
ఒక పెద్దకాంస్య విగ్రహా
నికి ప్రాణం వచ్చినట్టుగా,
ఒకే మేఘం గగన పథం దిగి
మానవుడైనిలిచినట్లుగా,
ఒకమహా వటవృక్షం
హఠాత్తుగా నడిచినట్టుగా,
ఒకే ఒక్కమానవమూర్తి
నా కళ్ళముందుకనిపించాడు
ఎం చేతో అతనిముఖంమీద
ఎప్పుడూ ఉండేపసిపాప నవులేదు?
ఆ మానవాననంలో
ఏదోకించిదిషాదం, కించిన్నిరాశ
కొంచెం విరాగం, కించి దసంతృప్తి,
ఆ మానవవదనంఅందరికీ పరిచితమే,
అతడే నువూ,నేనూఅంతమందీవెరసి.
సతంత్ర్యభరతవర్ష వాస్తవ్యుడామానవుడు
అర్ధనగ్నంగాఆకాశాన్నేకప్పుకొని
నిండనికడుపుతో మాడుతూన్నకళ్ళతో
ఇలాఎంతకాలం నిలబడతాడా ప్రాణి ?
అతణ్ణి జాగ్రత్తగాచూడండి
సతంత్ర్య భారతపౌరుడు,
అతనిబాధ్యతవహిస్తామని
అందరూ హామీఇవండి.
అతనియోగక్షేమాలకు
అంతా పూచీపడండి,
అతికించండిమళ్ళీ
అతనిముఖానికి నవు:
సాతంత్ర్యంఒక చాలా అందమైనవువు,
చాలావాడైన కత్తి, విలువైనవజ్రం
సాతంత్ర్యంతెచ్చే వెన్నెల్లోబాధ్యతలు
సామర్ధ్యంతోనిరహిస్తామని
సంకల్పం చెప్పుకుందాం:
భగవంతుని ప్రార్ధించిందికి
బహుశా ఇదిసమయం కాదు,
పాతవి గుంజాళించిందికి
బహుశా ఇదిసమయం కాదు.
ఇదిమనకొకదీక్షాసమయం
ఇదిమనకి పరీక్షాసమయం
ఆవేశం ప్రకటించిందికి
అసలే ఇదితరుణంకాదు--
రా :నేస్తం, పోదాం : చూదాం
మువన్నెల జవ్డూపండుగ ;
రా :నేస్తం , లేదాం: చూదాం;
మనభారతజనసౌభాగ్యం.
అటు చూడు సముద్రం,నేస్తం
హర్షానికి పర్యాయపదం:
ఇటుచూడు విహాయసనేత్రం
దు:ఖానికి అధ్యాహారం:
ఈ రెండింటిమధ్యనిలిస్తే
నీలోపల లోలోపలికే
ఆలాపనలాలోకిస్తే
వినపడదా ఒక సంగీతం,
విడివడదా ఒక సందేశం;
ఇదీనా సాతంత్ర్యదిన
మహా సంకల్పం.
ఇదినాప్రజలకునివాళి
సతంత్ర్య భారతపతాకాని
కిదినా అభివాదం.
భవిష్య దుజ్జల
భర్మయుగానికి ఆహానం,
సరిహద్దులులేని
సకల జగజ్జనులారా:
మనుష్యుడే నా సంగీతం,
మానవుడేనాసందేశం :