రంగూన్ రౌడి rangoon rowdy

ఓ జాబిలీ.. వెన్నెలా ఆకాశం ఉన్నదే నీకోసం
ఎదురు చూసింది నిదుర కాచింది తనువు నీకోసమే
వెలుగువై రావోయీ వెళుతురే నీవోయి
ఓ జాబిలి...
కదలిపోయే కాలమంతా
నిన్ను నన్ను నిలిచి చూసే
కలలు కన్న కౌగిలింత
వలపు తీపి వలలు వేసే
భ్రమర నాదాలూ...
భ్రమర నాదాలు ప్రేమ గీతాలై పరిమళించేనోయి
పున్నమై రావొయి నా పున్నెమే నీవోయి
ఓ జాబిలి..

నవ్వులన్ని పువ్వులైన
నా వసంతం నీకు సొంతం
పెదవి దాటి ఎదను మీటే
ప్రేమ బంధం నాకు సొంతం
ఇన్ని రాగాలూ...
ఇన్ని రాగాలు నీకు అందించే రాగమే నేనోయి
అనురాగమే నీవోయి
అనురాగమే నీవోయి
ఓ జాబిలి ...