ఓ.. అపురూపమా..

ఓ.. ప్రియతమా..
అనిశ్చలమై..పరుగులు తీసే
నా ఊహల నదిలో..
అనిశ్చితమై...అగమ్యమై
నీ మధుర ప్రేమాన్వేషణలో
నిరంతరం అవిశ్రాంతమై
పయనిస్తున్న నా మనసు నావని
ఒక్క సారిగా తాకిన
నీ ప్రేమ తరంగాలు
నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే..
చుక్కాని వై నన్ను నీ దరికి చేరుస్తావని
ఆశగా నీకోసం నలువైపులా చూసాను..
కాని నువ్వు ఎంచేసావో తెలుసా..?
నా చూపుల పవనాలని ఆసరాగా చేసుకుని
తెరచాపవై నన్ను మవునంగా
అనంత మైన నీ ప్రేమ సాగరం లోకి లాగివేసావు..
ఎటుచూసినా ఉవ్వెత్తున ఎగసి పడే
నీ ప్రేమ తరంగాల నడుమ..
నన్ను వొంటరిగా విడిచి ఎటో వెళ్ళిపోయావు..
ఓ..ప్రియతమా..
నీ ప్రేమ కోసమే నిరీక్షిస్తూ..
నీ ఊహలలోనే చరిస్తూ ..
నీ కోసమే నిరంతరం తపిస్తూ..
కన్నీటి లో తడుస్తూ...
వెయ్యి కళ్ళ తో నిన్నే వెదికే
ఈ ప్రేమ నావికుడిని
అందమైన నీ ప్రేమానురాగశోభితద్వీపసౌధానికే చేరవేస్తావో..
లేక..
అంతులేని గాడాంధకార నిర్జన నిలయాలకే నన్ను పయనింప జేస్తావో..
నీదే భారం..ప్రియా..
నీదే..భారం..