ఎవరు నీవు....
ఎవరు నీవు..
ఎచటి దానవు ..
కనులు మూయనీయవు..
గుండె ఆడనీయవు..
అడుగువేయనీయవు..
ఊపిరితీయనీయవు..
క్షణ క్షణం నీ ఆలోచనలతో
నా మనసుని చిత్తు చిత్తు గా చేసేస్తున్నావ్..
ఎవరు నీవు .. ఎచటి దానవు ..
తెలవార నీయవు..
దేవునికి మ్రొక్కనీయవు..
బువ్వ ముట్టనీయవు..
దాహము తీరనీయవు..
బుద్ధిగా చదువనీయవు..
కనులకు నిదురనీయవు..
క్షణ క్షణం నీ ఆలోచనలతో నా మనసుని
చిత్తు చిత్తు గా చేసేస్తున్నావ్..
ఎవరు నీవు.. ఎచటి దానవు ..
కలలోకి వస్తావు..
మోముదాస్తావు..
పిలచిన పలుకవు..
వెనుకకు చూడవు..
ఎందుకు నన్ను వేధిస్తావు..
ఎందుకు నన్ను బాధిస్తావు..
నీకై నేను తపియిస్తుంటే..
నీకై నేను జపియిస్తుంటే..
నేడు కలవై నన్ను ఊరించినా..
రేపు కనుచూపువై నన్ను కరుణిస్తావన్న ఆశతో..
వళ్ళంతా కళ్ళు చేసుకుని
నీ కోసం ఎదురుచూస్తున్నాను..
ఓ.. ప్రియతమా..
నా నిరీక్షణలో.. నువ్వు కలగానే కరిగిపోతే..
కన్నీటి కడలిని విశ్రమిస్తాను..
నా అన్వేషణలో.. నువ్వు కనువిందు చేస్తే...
ఆనంద సాగరమై ఉప్పొంగుతాను....