చక్రం chakram

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది


జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది


సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నాది


జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది


కదిలే కవితనై భార్యనై భర్తనై


మల్లెల దారిలో మంచు ఎడారిలో


మల్లెల దారిలో మంచు ఎడారిలో


పన్నీటి జయగీతాలే కన్నీటి జలపాతాలై


నాతో నేనే అనుగమిస్తు నాతో నేనె రమిస్తూ


ఒంరినై అనవరతం కంటున్నాను నిరంతరం


కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని రంగుల్నీ రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడ పిల్లలని


జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది


ఇంటికి కంటిని నేనై కంటను మంటను నేనేఅయ


మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై


మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల కూతల మంటను నేనై


రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ


వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం


కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని


జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది


జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది


గాలి పల్లకీలో న తరలి నా పాట పాప ఊరేగి వెడలె గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె


నా హ్రుదయమే నా లోగిలి


నా హ్రుదయమే నా పాటకి తల్లి


నా హ్రుదయమే నాకు ఆలి నా హ్రుదయములో ఇది సినీవాలి


జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది