కన్నెవయసు kanne vayasu
నా మదిలో నీవై నిండిపోయెనే..
నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వుల నవ్యతారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే..
పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే!
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన రాజహంసలా రావే!
నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే!