ప్రేమించు-పెళ్ళాడు preminchu pelladu
స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె
హాయిగా పాటపాడే కోయిలే మాకు నేస్తం తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం అలలపై నాట్యమాడే వెన్నెలే వేణు గానం
ఆకసానికవి తారలా.. ఆశకున్న విరిదారులా..
ఈ సమయం ఉషోదయమై..మా హృదయం జ్వలిస్తుంటే
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
అగ్నిపత్రాలు రాసీ గ్రీష్మమే సాగిపోయే మెరుపులేఖలు రాసే మేఘమే మూగవోయే
మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే మాఘ దాహాలలోనా అందమే అత్తరాయే
మల్లెకొమ్మ చిరునవ్వులా.. మనసులోని మరు దివ్వెలా..
ఈ సమయం రసోదయమై..మా ప్రణయం ఫలిస్తుంటే
ఇన్ని కలలిక ఎందుకో..కన్నె కలయిక కోరుకొ కలవరింతే కౌగిలింతై
నిజము నా స్వప్నం..అహా కలనో..హొహో..లేనో..హొహో హో
నీవు నా సత్యం..అహా అవునో..హొహో..కానో .. హొహొ
ఊహ నీవే ..ఆహహాహా.. ఉసురుకారాదా..ఆహా
మోహమల్లే..ఆహహాహా.. ముసురుకోరదా..ఆహా
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ మువ్వ గోపాలుని రాధికా
ఆకాశవీణా గీతాలలోన ఆలాపనై నేకరిగిపోనా
తాకితే పాపం ..హొహో.. కమలం..హొహో..భ్రమరం..హొహో హో
తాగితే మైకం..హొహో అధరం..హొహో..మధురం..హొహో హో
పాట వెలదీ..ఆహహాహా..ఆడుతూ రావే తేట గీతీ..ఆహహాహా.. తేలిపోనీవే
పున్నాగ కొవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుకా
చుంబించుకున్న బింభాధరాల సూర్యోదయాలే పండేటి వేళ