ఆనందం AnaMdam

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా చలి చెర అసలెప్పుడు వదిలిందో
అణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా తొలి శకునం ఎప్పుడు ఎదురైందో
చూస్తూనే ఎక్కడనుంచో చైత్రం కదిలొస్తుంది
పొగమంచును పోపో మంటూ తరిమేస్తుంది
నేలంతా రంగులు తొడిగి సరికొత్తగ తోస్తుంది
తన రూపం తానె చూసి పులకిస్తుంది
ఋతువెప్పుడు మారిందో బ్రతుకెప్పుడు విరిసిందో
మనసెప్పుడు వలపుల వనమైందో ఎవరైన ఎపుడైన
ఎవరైన ఎపుడైన ఈ చిత్రం చూశారా నడి రాతిరి తొలి వేకువ రేఖా
నిదురించె రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖా
గగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలా
కేరింతల వంతెన ఇంక ఎక్కడిదాక
చూసెందుకు అచ్చంగా మన భాషే అనిపిస్తున్నా అక్షరమూ అర్ధం కాని ఈ విధి రాత
కన్నులకే కనపడని ఈ మమతల మధురిమతో హౄదయాలను కలిపే శుభలేఖ ఓ ఓ ఓ ఓ..
ఎవరైన ఎపుడైన ఈ చిత్రం చూశారా నడి రాతిరి తొలి వేకువ రేఖా
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా..
నిజం తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా..

ఎదుటే.. ఎపుడూ తిరిగే వెలుగా.. ఇదిగో..ఇపుడే..చూసా సరిగా..

ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోనా.. అయితే నాకీనాడే పొద్దుజాడ తెలిసింద కొత్తగా !

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా.. నిజం తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా..

పెదవుల్లో ఈ దరహాసం నీ కోసం పూసిందీ.. నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తొందీ..
ఎందుకనో మది నీ కోసం ఆరాటం పడుతోందీ.. అయితేనే ఆ అలజడి లో ఒక ఆనందం ఉందీ..

దూరం మహ చెడ్డదనీ ఈ లోకం అనుకుంటుందీ.. కానీ ఆ దూరమె నిన్ను దగ్గర చేసిందీ…
నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసిందీ.. నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలె నా ఊపిరైనవని !

కనులు తెరిచినా -2

నిజం తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా..ప్రతి నిముషం నా తలపంతా నీ చుట్టూ తిరిగిందీ ..
ఎవరైనా కనిపెడతారని కంగారుగా ఉంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తుందీ..నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయం అయ్యింది

అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే నేనే ఇక లేనట్టూ నీలో కరిగించావే
ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది నువ్వే నా సందేహానికి వెచ్చనైన ఋజువియ్యమంది మరి !

కనులు తెరిచినా -2

ఎదుటే.. ఎపుడూ తిరిగే వెలుగా.. ఇదిగో..ఇపుడే..చూసా సరిగా..
ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోనా.. అయితే నాకీనాడే పొద్దుజాడ తెలిసింద కొత్తగా !