నిర్జీవం కానీ.....

ప్రియతమా..
నీ అందమైన తనువును తాకలేని ఈ చేతులు ఎందుకు..
విరిగి మోడులై పోనీ..
నీ కటాక్ష వీక్షణాలు గానలేని ఈ కనులెందుకు..
పేలి కాలి పోనీ..
నీ తీయని పిలుపు వినలేని ఈ చెవులు ఎందుకు..
బిగి గడియలు పడనీ..
నా అనురాగాన్ని తెలుపుకోలేని ఈ నోరు ఎందుకు..
పడి మూగ బోనీ..
నీతో కలసి నడవలేని ఈ పాదాలు ఎందుకు..
కఠిన పాషాణము లై పోనీ..
నీ హృదయాన్ని అందుకోలేని ఈ హృదయం ఎందుకు..
ఫెళ్ళున పగిలి శకలవికలములు కానీ..
నీవు వెదజల్లే అనంత పరిమళాలని
ఆస్వాదించలేని ఈ శ్వాస ఎందుకు..
నిశ్చయంగా స్తంభించనీ..
నీ ప్రేమ పొందలేని ఈ జీవం ఎందుకు ప్రియా..
నిర్జీవం కానీ..