నిరీక్షణ...

ప్రియాతమా..
ఎక్కడున్నావ్ నువ్వు ..
నీకు ఇంకా నా మీద దయ కలగలేదా..
నువ్వు ఇలా కలలోనే కనిపిస్తూ..
చివరికి కలలానే కరిగిపోతావేమో అని
భయంగా .. దిగులు గా వుంది..
నా కనురెప్పలు నీకై ఎదురు చూసీ..చూసీ..
నిరాశ తో..సోలి పోతున్నాయి..
నా శ్రవణరంధ్రాలు నీ అడుగుల సవ్వడికై వేచి వేచి
శిధిలమవుతున్నాయి..
నా శ్వాస నీ పరిమళాలకై తపించి..తపించి..
భారమైపోతొంది..
నా పెదవులు నీ స్మరణ చేసి..చేసి అలసిపోయాయి..
నా మనసు నీ కోసం నిరంతరం
ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడు తోంది..
అయినా.. నా మీద కొంచెమైనా నీకు జాలిలేదేం ప్రియా...
నువ్వు ఎప్పటికైనా కనిపిస్తావన్న ఆశ
నాలో చావటం లేదు..
ఎప్పటికి కరుణిస్తావో నన్ను తెలియదు నాకు..
నా జీవితమంతా నీ రాక కోసం
ఇలా ఎదురు చూస్తూనే వుంటాను..
ఒక వేళ నేను మరణించినా..
నా ఆత్మ కేవలం నీ కోసమే..నిరీక్షిస్తూ వుంటుంది..
అది మాత్రం.. ముమ్మాటికీ..నిజం....