ప్రియతమా ....
నా గుండె గుహలో గుట్టుగా..
అజ్ఞాతంగా...
అచేతనమై..
నిస్తేజమై...
నిద్రాణమైపడివున్న
నా ప్రేమ కి ప్రాణం పోసి
బ్రతికించిన నా ప్రేమామృతానివి నువ్వు..
నా ప్రేమకు ఆలంబన నువ్వు ..
నా భాషకు భావానివి..
నా భావానికి బంధానివి ..
నా ఊహలకు ఊపిరివి..
నా సంకల్పానికి సాధనవి..
నా వెలుగుకి జ్యోతివి..
నా కన్నులకు కాంతివి..
నా మనసుకు శాంతివి..
నా నరనరాల్లో మరుగుతున్న మెరుపుతీగవి..
నా హృదయంలో చెలరేగిన
ప్రేమతరంగానివి..
నా జీవితంలో మధురాశయానివి..
నా ప్రియభావనవి..
నా ప్రాణానికి ప్రాణానివి నువ్వు...