స్నేహమయి....

ఓ స్నేహమయీ ...
ప్రియమైన ఓ స్నేహమయీ ...
ప్రతి రోజు నీ స్నేహసందేశం వచ్చే
మధురమైన క్షణాల కోసం
నా వొళ్ళంతా కళ్ళు చేసుకుని
ఏంతో ఆశగా దానికై ఎదురు చూస్తాను..
నీ సందెశం వచ్చే వరకు నీ ఆలోచన లే
నా గుండె చుట్టూ తిరుగుతాయి..
నీ సందెశం చూడాలని తహ తహ లాడతాయి.
నీ సందేశం తో పాటు వచ్చే నీ స్నేహ పరిమళాలు
నన్ను ఆనందం తో ఉక్కిరి బిక్కిరి చేస్తాయి..
నువ్వు ప్రతి రోజు నాకు తెలిపే శుభోదయాలు..శుభసంధ్యలు..శుభరాత్రు లే
నా గది నిండా నీ స్నేహ సుఘంధాలు వెదజల్లు తాయి..
నువ్వు తెలుపక తెలిపే నీ మూగ భావాల లోను..
నా మనసుని మధురంగా తాకే నీ స్నేహ తటుల లోను..
ఏదో చెప్పలేని ఒక వింత అనుభూతిని చవిచూడాలని ..
నీ స్నేహమాధుర్యాన్ని మనసారా ఆస్వాదించాలని నేను ఎంతో గానో ఆశిస్తాను..
నీ సందేశం రాని రోజున నాకు ఏమి తోచదు..
ఏ పని చేయాలని పించదు..
ఏదో పోగొట్టు కున్నట్టుగా నా మనసు ఒకటే బాధ పడుతుంది..
నీ మీద చెప్పలేని కోపం కూడా వస్తుంది.. తెలుసా?
కాని అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా?
నిన్నటి నీ సందేశాన్నే మళ్లీ మళ్లీ చదువు కొని
నా మనసుని ఊరడించు కుంటాను..
మరి నాకు కలిగిన అదే భావన
నీకు ఎప్పుడైనా కలిగిందో లేదో నాకు తెలియదు..
కాని నాకు మాత్రం నువ్వంటే ఏంటో తెలుసా?
నా తియ్యని స్నేహానివి నువ్వు..
నా స్నేహ స్పందనవి నువ్వు..
నా స్నేహరస మాధురివి నువ్వు..
స్నేహానికి ప్రతిరూపం నువ్వు..
నా గుండె లోయల్లో నిశ్శబ్దం గా ప్రవహించే స్నేహరస వాహినివి నువ్వు..
నా చీకటి ప్రపంచం లోకి జొరబడిన ఒక అద్వితీయ కాంతి కిరణ్మయి వి నువ్వు..
నీ స్నేహం లో నేను వెలుగునే తప్ప ఎలాంటి అంధకారాన్ని చూడలేను.
ఒక్క నీ సందేశం చాలు నా బాధలన్ని మర్చిపోవడానికి..
నా పై నీ మనసుకున్న భావాలు చాలు..
నా ఆశలు నిండుగా ఫలించడానికి ..
నా ప్రతి రోజు లో నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చేది..
నా మనసుని తేలిక పరచేది...
నాకు హాయినిచ్చేది..
నా బాధలన్నిటిని మరపించేది..
ఒక్క నీ తియ్యని సందేశమే సుమా...
నా ప్రతి ప్రశాంత సమయంలోను
నీ అందమైన భావాలు స్నేహావీచక లై
నన్ను అల్లి బిల్లి గా తాకినప్పుడు
చల్లని చిరునవ్వుతో నిండిన వెన్నెల మోముతో
నీ రూపం నాతో ఏదో చెప్పాలన్నట్టు గా
నా గుండెలో కదలాడు తుంది ..
అప్పటి నా ఆనందాన్ని నిజంగా నేను మాటలతో చెప్పలేను..
ఓ.. స్నేహమయి..
ఆ నీ రూపమే స్నేహ దీపమై..
నా చీకటి బాటకి వెలుగివ్వాలని..
ఆ వెలుగు లోనే నీతో నా చెలిమి
కలకాలం మధురంగా సాగిపోవాలనీ..
మనసారా ఆశిస్తూ..
మళ్లీ నీ స్నేహ సందేశం వచ్చే తియ్యని క్షణాల కోసం
కాల భారాన్ని నా కనురెప్పలపై మోస్తూ ..
ఎదురుచూస్తుంటాను నేస్తం..