సిరి వెన్నెల sirivennela

ఆది భిక్షువు వాడి నేది కోరేది బూడిదిచ్చే వాడి నేది అడిగేది
చందమామ రావే జాబిల్లి రావే. కొండెక్కి రావే గోగుపూలు తేవే ... చలువ చందనములుపూయ చందమామ రావే. జాజిపూల తావినియ్య జాబిల్లి రావే ...
ప్రకృతి కాంతకు యెన్నెన్ని హొయలో పదము కదిపితె యెనెన్ని లయలో
ప్రకృతి కాంతకు యెన్నెన్ని హొయలో పదము కదిపితె యెనెన్ని లయలో
యెన్నెన్ని హోయలొ యెనెన్ని లయలో
యెన్నెన్ని హోయలొ యెనెన్ని లయలో
సిరివెన్నెల నిండిన యెదపై సిరి మువ్వల సవ్వడి నీవై నర్తించగ రావేలా
నిన్ను నే కీర్తించె వేళ

అలల పెదవులతో శిలల చెక్కిలిపై కడలి ముద్దిడు వేల పుడమి హౄదయంలో
అలల పెదవులతో శిలల చెక్కిలిపై కడలి ముద్దిడు వేల పుడమి హౄదయంలో
ఉప్పొంగి సాగింది అనురాగము ఉప్పెనగ దూకింది ఈ రాగము

చినుకు చినుకు చినుకు చినుకు తొలి తొలి తొలకరి చిలికిన చినుకు
పిలుపు పిలుపు పిలుపు పిలుపు పుడమికి పులకల మొలకల పిలుపు
ఆషాడ మాసాన ఆ నీలి గగనాల మేఘాల రాగాల ఆలాపన
ఆషాడ మాసాన ఆ నీలి గగనాల మేఘాల రాగాల ఆలాపన
మేఘాల రాగాల ఆలాపన
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు - 2
ననుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు - 2

ఈ గాలి||

చిన్నారి గొరవంక ..
కూసేను ఆ వంక ..
నా రాక తెలిశాక ..వచ్చేను నా వంక -2
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక -2
ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగి దాక -2
ఎగసేను నింగి దాక

ఈ గాలి||

ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలలు ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడొ ఈ కళలు -2
ఏ వలపుల తలపులతో చిలికాడో ఈ కళలు -2
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇక నాట్యాలాడేను - 2
ఈ గాలి||
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
ఓం! ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం
ఓం! కనుల కొలనులో ప్రతిబిం బించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
సరస స్వర సుర ఝరి గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

చరణం: ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగ్రుత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
పలికిన కిల కిల స్వరముల స్వరజతి దొరకని జగతికి శ్రీకారము కాగా
విశ్వ కావ్యమునకిది భాష్యముగా

విరించినై||

చరణం: జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హౄదయ మౄదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సౄష్టి విలాసములే


విరించినై||